చిత్తూరు జిల్లాలో సీఎం చంద్ర‌బాబు పర్యటన

Spread the loveపలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చిత్తూరు జిల్లా : రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త్వ‌ర‌లో చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. వివిధ సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తారు. కంగుంది పర్యాట‌క‌ ప్రాంతంగా అభివృద్ధి పనులలో సీఎం పాల్గొంటార‌ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. సీఎం ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం…

hellotelugu-APCMTour
Spread the love

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

చిత్తూరు జిల్లా : రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త్వ‌ర‌లో చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. వివిధ సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తారు. కంగుంది పర్యాట‌క‌ ప్రాంతంగా అభివృద్ధి పనులలో సీఎం పాల్గొంటార‌ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. సీఎం ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం చేయాల‌ని ఎమ్మెల్సీ శ్రీ‌కాంత్ కోరారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం కడ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడితో క‌లిసి స‌మీక్ష చేప‌ట్టారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేపటి రోజున అధికారికంగా ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలు సంబంధించి వివరాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈనెల చివరి తేదీలలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంద‌న్నారు. చంద్ర‌బాబు వివిధ శంకుస్థాపన పనులు, ప్రారంభోత్సవాలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం పాల్గొంటారని తెలిపారు. సామాజిక భద్రతా పెన్షన్లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సంబంధించిన శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తామ‌న్నారు.

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తారని తెలిపారు క‌లెక్ట‌ర్.హెచ్ ఎన్ ఎస్ ఎస్ అధికారులు, డాక్యుమెంట్ రూపంలో నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు, డిఎంహెచ్ ఆధ్వర్యంలో సంజీవని ప్రాజెక్ట్, ప్రాంతీయ వైద్య శాలల సంబంధించిన సమగ్ర రిపోర్టును సిద్ధం గా ఉంచాల‌న్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఏదో ఒక గ్రామంలో ముఖ్యమంత్రి లబ్ధిదారులతో ముచ్చటిస్తారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి బహిరంగ సభ, వివిధ ఆస్తుల పనిముట్లు పంపిణీ, మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పలు పారిశ్రామివేత్తలతో ఒప్పందాలు, స్వయం మహిళ సంఘాల ప్రతినిధులకు 500 మంది రుణాలు పంపిణీ చేస్తార‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports