విష ప్ర‌చారంపై కోర్టు గ్యాగ్ ఆర్డ‌ర్ జారీ

Spread the loveస్ప‌ష్టం చేసిన టీటీడీ చైర్మ‌న్ నాయుడు తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఈ మేర‌కు అధికారికంగా త‌న‌పై జ‌రుగుతున్న విష ప్ర‌చారం ప‌ట్ల స్పందించారు. టీటీడీ ఛైర్మన్‌గా త‌న‌ పై జరుగుతున్న విష ప్రచారంపై హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. నాపై ఆధారరహిత, దుష్ప్రచార కథనాలను ఇకపై ప్రసారం లేదా ప్రచారం చేయకూడదని…

newsseals-TTDChariman
Spread the love

స్ప‌ష్టం చేసిన టీటీడీ చైర్మ‌న్ నాయుడు

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఈ మేర‌కు అధికారికంగా త‌న‌పై జ‌రుగుతున్న విష ప్ర‌చారం ప‌ట్ల స్పందించారు. టీటీడీ ఛైర్మన్‌గా త‌న‌ పై జరుగుతున్న విష ప్రచారంపై హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. నాపై ఆధారరహిత, దుష్ప్రచార కథనాలను ఇకపై ప్రసారం లేదా ప్రచారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు టీటీడీ చైర్మ‌న్ . ఇప్పటికే ప్రచురితమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా పేర్కొందని స్ప‌ష్టం చేశారు.

అలాగే గూగుల్, ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు సంబంధిత కంటెంట్‌ను డౌన్ చేయాలని ఆదేశాలు జారీ సింద‌న్నారు బీఆర్ నాయుడు. తిరుమల ప్రతిష్టను దెబ్బ తీయాలనే కుట్రలో భాగంగా, ఏఐ, మార్ఫింగ్ వీడియోల ద్వారా నాపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చ‌రించారు . సత్యం చివరకు గెలుస్తుందని, ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు బీఆర్ నాయుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports