స్వేచ్ఛ కుటుంబానికి జేసీహెచ్ఎస్ఎల్ ఆస‌రా

Spread the loveరూ. 50,000 ఆర్థిక సాయం అంద‌జేసిన ప్రెసిడెంట్ హైద‌రాబాద్ : ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ త‌న ఉదార‌త‌ను చాటుకుంది. గత సంవత్సరం జూన్ నెలలో మరణించిన ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు “స్వేచ్ఛ” కుటుంబానికి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. గతంలో ఆమె కుటుంబ సభ్యులకు రూ.50,000 అందజేసిన మేనేజింగ్ కమిటీ సభ్యులు, నిన్న “స్వేచ్ఛ” కుమార్తె చదువు, కుటుంబ అవసరాల కోసం…

Newsseals-JCHSL
Spread the love

రూ. 50,000 ఆర్థిక సాయం అంద‌జేసిన ప్రెసిడెంట్

హైద‌రాబాద్ : ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ త‌న ఉదార‌త‌ను చాటుకుంది. గత సంవత్సరం జూన్ నెలలో మరణించిన ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు “స్వేచ్ఛ” కుటుంబానికి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. గతంలో ఆమె కుటుంబ సభ్యులకు రూ.50,000 అందజేసిన మేనేజింగ్ కమిటీ సభ్యులు, నిన్న “స్వేచ్ఛ” కుమార్తె చదువు, కుటుంబ అవసరాల కోసం మరో రూ.50,000లను “స్వేచ్ఛ” తండ్రి శంకరన్నకు అందజేశారు.

ఇదిలా ఉండ‌గా ఈ మొత్తం మేనేజింగ్ కమిటీ సభ్యుల వ్యక్తిగత కాంట్రిబ్యూషన్ ద్వారా సమకూర్చబడింది. )
ఈ సందర్భంగా “స్వేచ్ఛ” కుటుంబానికి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని శంకరన్నకు హామీ ఇచ్చారు సంస్థ ప్రెసిడెంట్ బ్ర‌హ్మాండ‌గిరి గోపరాజు. త‌న జీవిత‌మంతా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసిన గొప్ప జ‌ర్న‌లిస్టు స్వేచ్ఛ అని పేర్కొన్నారు. ఆమె మ‌న మ‌ధ్య లేక పోవ‌డం బాధగా ఉంద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామ‌ని భ‌రోసా కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports