స‌మాజ చైత‌న్యం కోసం సినిమా సాధ‌నం కావాలి

Spread the loveపిలుపునిచ్చిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ది కోసం ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఐలైన్ హైదరాబాద్ తన కేంద్రాన్ని ప్రారంభించిందని, నెట్‌ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్టేన‌ని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణం కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తాం అని ప్ర‌క‌టించారు.…

newsseals-CM
Spread the love

పిలుపునిచ్చిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ది కోసం ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఐలైన్ హైదరాబాద్ తన కేంద్రాన్ని ప్రారంభించిందని, నెట్‌ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్టేన‌ని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణం కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తాం అని ప్ర‌క‌టించారు. అందుకు త్వరలోనే ఒక ప్లాట్‌ఫామ్‌ క్రియేట్ చేస్తామ‌ని చెప్పారు సీఎం.

లక్షల కోట్ల మందిని తన గళంతో ప్రజలను ప్రభావితం చేసిన ప్రజాయుద్ధ నౌక గ‌ద్ద‌ర్ ఒక చైతన్యం, స్ఫూర్తి, అందుకని ఆయ‌న‌ పేరుతో ఈ అవార్డులను పునరుద్ధరించాం అని తెలిపారు. సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడానికి సినిమాలు అత్యంత ప్రభావ వంతమైన ఆయుధంగా ఉప‌యోగ ప‌డ‌తాయ‌ని చెప్పారు. సమాజాన్ని చైతన్య పరిచేందుకు సినిమా ఒక సాధనంగా ఉపయోగపడాలి. సామాజిక బాధ్యతను గుర్తెరిగి, సామాజిక సమస్యల పరిష్కారానికి సినిమాల ద్వారా సందేశం అందించాలని పిలుపునిచ్చారు సీఎం.

తెలంగాణ అత్యంత భద్రత కలిగిన రాష్ట్రం. టాలెంట్‌కు అవకాశాలున్నాయి. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుంది. హాలీవుడ్ చిత్రాలను ఇక్కడ నిర్మించండి. మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వం హామీనిస్తుంది అని చెప్పారు. ప్రత్యేక విభాగంలో కొణిదెల చిరంజీవి (ఎన్టీఆర్ జాతీయ పురస్కారం), సింగీతం శ్రీనివాస రావు (బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు), చలసాని అశ్వినీదత్ (నాగిరెడ్డి చక్రపాణి అవార్డు), సుద్దాల అశోక్ తేజ (డాక్టర్ సి. నారాయణరెడ్డి అవార్డు), జయసుధ (అక్కినేని నాగేశ్వరరావు అవార్డు), ఆర్ నారాయణ మూర్తి (కాంతారావు అవార్డు), అక్కినేని రమేష్ ప్రసాద్ (రఘుపతి వెంకయ్య అవార్డు), కమల్ హాసన్ (పైడి జైరాజ్ అవార్డు), ఉత్తమ నటుడు నాగ చైత‌న్య (తండేల్), ఉత్తమ నటిగా ర‌ష్మిక మంద‌న్నా (ది గర్ల్ ఫ్రెండ్)లతో పాటు వివిధ కేటగిరీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports