ముంద‌స్తు అరెస్ట్ ల‌పై బీజేపీ ఆగ్ర‌హం

Spread the loveనిప్పులు చెరిగిన క‌సిరెడ్డి సింధు రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న కొన‌సాగ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర బీజేవైఎం నాయ‌కురాలు క‌సిరెడ్డి సింధు రెడ్డి. సోమ‌వారం బీజేపీ ఇచ్చిన పిలుపు మేర‌కు ఆమె నిర‌స‌న‌లో పాల్గొనేందుకు ప్ర‌య‌త్నం చేశారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ముంద‌స్తుగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను గృహ నిర్బంధం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్రజాస్వామ్యాన్ని…

newsseals-SindhuReddy
Spread the love

నిప్పులు చెరిగిన క‌సిరెడ్డి సింధు రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న కొన‌సాగ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర బీజేవైఎం నాయ‌కురాలు క‌సిరెడ్డి సింధు రెడ్డి. సోమ‌వారం బీజేపీ ఇచ్చిన పిలుపు మేర‌కు ఆమె నిర‌స‌న‌లో పాల్గొనేందుకు ప్ర‌య‌త్నం చేశారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ముంద‌స్తుగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను గృహ నిర్బంధం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాట్లాడే కాంగ్రెస్ ఆచ‌ర‌ణ‌లో దానిని బొంద పెట్టేందుకు య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు సింధు రెడ్డి.

ప్రజాస్వామ్యాన్ని నేడు కాళ్లతో తొక్కుతోందని ధ్వ‌జ‌మెత్తారు. ఇదేనా ప్ర‌జా ప్ర‌భుత్వం అంటే అని ప్ర‌శ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ‌చంద‌ర్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులపై ముందస్తు అరెస్టులు చేయించడం ప‌ట్ల మండిప‌డ్డారు సింధు రెడ్డి. ఇది వారి భయాన్ని బహిర్గతం చేస్తోందన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకే నా ఇంటి ముందు 5 మంది పోలీసులు నిలబడి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం, ప్రజల స్వరాన్ని అణచి వేయాలనే ప్రయత్నమే త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports