దురంధ‌ర్ -2 స‌క్సెస్ ఆర్జీవీ కామెంట్స్

Spread the loveఇదంతా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌వ‌ల్లే సాధ్యం ముంబై : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన దురంధ‌ర్ -2 మూవీ దుమ్ము రేపుతోంది. కాసుల పంట పండిస్తోంది. ప్ర‌త్యేకించి పాకిస్తాన్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. అక్క‌డి స‌ర్కార్ తో పాటు ఇత‌ర ముస్లిం దేశాలు సైతం భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాయి. ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ త‌రుణంలో సినీ రంగానికి…

newsseals-RamGopalVarma
Spread the love

ఇదంతా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌వ‌ల్లే సాధ్యం

ముంబై : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన దురంధ‌ర్ -2 మూవీ దుమ్ము రేపుతోంది. కాసుల పంట పండిస్తోంది. ప్ర‌త్యేకించి పాకిస్తాన్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. అక్క‌డి స‌ర్కార్ తో పాటు ఇత‌ర ముస్లిం దేశాలు సైతం భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాయి. ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ త‌రుణంలో సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు, న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు సైతం దురంధ‌ర్ -2 ది రివెంజ్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సినిమా అద్బుతంగా ఉందంటూ పేర్కొన్నారు.

దురంధ‌ర్ -2 మూవీని తెర‌పై చూశాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. త‌న‌ను ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్, భార్య కూడా క‌లుసుకుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు . త‌ను సామాన్యంగా ఏకి పారేస్తాడు కానీ ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. ధురంధర్‌ను కేవలం ఒక సినిమా అని పిలవడం దానికి అన్యాయం చేయడమే అవుతుందన్నాడు. దర్శకుడు ఆదిత్య ధర్ నుండి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ సినిమా ప్రభావం చాలా భారీగా ఉంది. ‘ధురంధర్ 2’ ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. భారతీయ సినిమాకు ఒక కొత్త మార్గాన్ని చూపించినందుకు ఆదిత్య ధర్‌కు అభినంద‌న‌లు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు ఆర్జీవీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports