స‌ముద్ర విహారాన్ని ప్రోత్స‌హించేలా చూడాలి

Spread the loveకీల‌క ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు ఏపీ ప‌ర్యాట‌క రంగంపై.సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను కూడా నిర్వహించేలా చూడాలన్నారు. తెలంగాణా లాంటి ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు దీనికి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతారన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే టెంట్ సిటీలను కేటగిరీలుగా విభిజించి…

newsseals-APtourism
Spread the love

కీల‌క ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు ఏపీ ప‌ర్యాట‌క రంగంపై.
సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను కూడా నిర్వహించేలా చూడాలన్నారు. తెలంగాణా లాంటి ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు దీనికి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతారన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే టెంట్ సిటీలను కేటగిరీలుగా విభిజించి ప్రోత్సహిస్తే అందరికీ అందుబాటులోకి వస్తాయన్నారు సీఎం. కనీసం వెయ్యి టెంట్ సిటీలను గోదావరి పుష్కరాల నాటికి అందుబాటులోకి తేవాలని సీఎం సూచనలు జారీ చేశారు. క్రియేటివ్ ఎకనామినీ ప్రోత్సహించేందుకు కంటెంట్ క్రియేషన్ పెద్ద ఎత్తున జరగాలన్నారు. క్రియేటివ్ ఎకానమీని సృష్టించేలా అమరావతి క్రియేటివ్ సిటీగా ఎదగాలన్నారు.

బాలివుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా క్రియేటివ్ ఎకనామీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఐకానిక్ డెస్టినేషన్ స్కీమ్ కింద విశాఖ, తిరుపతి నగరాలను అభివృద్ధి చేయాలని.. ప్రతీ ఐకానిక్ డెస్టినేషన్ కు రూ.500 కోట్ల వరకూ వెచ్చించేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గత ఏడాదిలో పర్యాటక ప్రాంతాలకు 30.92 కోట్ల మంది పర్యాటకుల ఫుట్ ఫాల్ నమోదైందని ఈ ఏడాదిలో 9 నెలల కాలానికి గానూ 21 శాతం మేర వృద్ధి కనిపించిందని.. ఇది మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన ఆలయాలను అనుసంధానించి టెంపుల్ టూరిజం కూడా ఇంటిగ్రేట్ చేయాలని సీఎం సూచించారు. సూర్యలంక బీచ్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలన్నారు. వీటితో పాటు తిరుపతిలో ఉన్న చెరువులు, అమరావతి ప్రాంతంలోని కాలువలు, విశాఖ సహా వేర్వేరు ప్రాంతాలను సుందరీకరణ చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports