ఇక అమ‌రావ‌తిని ఎవ‌రూ మార్చ‌లేరు – శ్రీ‌

Spread the loveజ‌గ‌న్ పై నిప్పులు చెరిగిన బండారు శ్రావ‌ణి అనంత‌పురం జిల్లా : ఎన్ని కుట్ర‌లు చేసినా చివ‌ర‌కు అంతిమంగా ధ‌ర్మ‌మే గెలిచింద‌ని అన్నారు సింగ‌న‌మ‌ల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్దత వచ్చిన సందర్భంగా పార్లమెంటులో సహకరించిన పార్టీలకు, నేతలకు, భారతదేశం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తు అనంతపురం జిల్లా , శింగనమల నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో…

newsseals-BandaruravaaniSree
Spread the love

జ‌గ‌న్ పై నిప్పులు చెరిగిన బండారు శ్రావ‌ణి

అనంత‌పురం జిల్లా : ఎన్ని కుట్ర‌లు చేసినా చివ‌ర‌కు అంతిమంగా ధ‌ర్మ‌మే గెలిచింద‌ని అన్నారు సింగ‌న‌మ‌ల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్దత వచ్చిన సందర్భంగా పార్లమెంటులో సహకరించిన పార్టీలకు, నేతలకు, భారతదేశం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తు అనంతపురం జిల్లా , శింగనమల నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీపాలు వెలిగించారు ఎమ్మెల్యే. ప్రజా రాజధాని అమరావతి కి దీ పహారతులు ఇచ్చారు.

అమరావతి బిల్లుకు ఉభయ సభలలో ఆమోదం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. ఇది ప్రజా రాజధాని అని.. నా రాజధాని అమరావతి అంటూ గర్వంగా చాటాల‌ని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం సాధించిన విజయంగా అభివ‌ర్ణించారు. రాష్ట్ర రాజధాని అమరావతి పై వైసీపీ నేత జగన్ విషం కక్కడం మానాల‌ని హిత‌వు ప‌లికారు. ప్రజలు కోరిన ప్రజా రాజధానికి మద్దతు పలికేందుకు జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. అమరావతి రాజధానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రధాని నరేంద్ర మోడీకి,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports