బీజేపీ ప‌టిష్ట‌త కోసం కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలి

Spread the loveమంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ పిలుపు అనంత‌పురం జిల్లా : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌పురం జిల్లాధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. “Nation First – Party Next – Self Last” అనే భావనతో ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి ఏకాత్మ భావంతో,…

newsseals-SatyaKumarYadav
Spread the love

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ పిలుపు

అనంత‌పురం జిల్లా : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌పురం జిల్లా
ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. “Nation First – Party Next – Self Last” అనే భావనతో ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి ఏకాత్మ భావంతో, దేశ సేవనే పరమావధిగా తీసుకుని ముందుకు సాగుతోందని స్ప‌ష్టం చేశారు.

1985లోనే మాజీ ప్రధానమంత్రి , దివంగ‌త‌ అటల్ బిహారీ వాజపేయి కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించే రోజు వస్తుందని చెప్పారన్నారు. ఈ విష‌యాన్ని మ‌రోసారి గుర్తు చేశారు మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ఆ మాటలు నేటి రాజకీయ పరిణామాల్లో నిజమయ్యాయని అన్నారు. దేశం, సమాజం కోసం కట్టుబడి పని చేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports