పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం సీఎం స‌మీక్ష

Spread the loveకీల‌క సూచ‌న‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై బుధ‌వారం స‌చివాల‌యంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వ‌హించారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌పై చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చ‌ర్చించారు. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను వివరించారు ఈ సంద‌ర్బంగా అధికారులు. అత్యధికంగా కడపలో 1.99, అత్యల్పంగా విశాఖలో 1.32 శాతంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు ఉంద‌ని తెలిపారు సీఎంకు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.5…

newsseals-APCM
Spread the love

కీల‌క సూచ‌న‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు

అమరావతి : రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై బుధ‌వారం స‌చివాల‌యంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వ‌హించారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌పై చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చ‌ర్చించారు. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను వివరించారు ఈ సంద‌ర్బంగా అధికారులు. అత్యధికంగా కడపలో 1.99, అత్యల్పంగా విశాఖలో 1.32 శాతంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు ఉంద‌ని తెలిపారు సీఎంకు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.5 సగటుతో టోటల్ ఫెర్టిలిటీ రేటు నమోదు అయినట్టు పేర్కొన్నారు. ఈ లక్ష్యం 2.1కి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్షకు వైద్యారోగ్య శాఖ ఉన్న‌తాధికారులు హాజ‌రయ్యారు . కాగా సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న 7,074 మందికి లబ్ది చేకూరేలా రూ.56.39 కోట్లు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి సంబంధిత ఫైలు పై సంతకం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 22 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మొత్తం 1,43,314 మంది లబ్ధిదారులకు రూ.1,298.33 కోట్లు అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద మొత్తంలో సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports