ఇరాన్ పై మ‌రోసారి దాడులు చేస్తాం

Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ట్రంప్అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి నోరు పారేసుకున్నారు ఇరాన్ పై. వారు తాము చెప్పిన ఫార్ములాకు ఒప్పుకోవాల‌ని లేకపోతే తిరిగి దాడులు చేసేందుకు వెనుకాడ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండదని ట్రంప్ పదేపదే చెప్పారు. ఇరాన్ తాజా ప్రతిపాదనతో తాను సంతృప్తి చెందలేదని అన్నారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని పామ్ బీచ్ అంతర్జాతీయ…

newsseals-Trump
Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ట్రంప్
అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి నోరు పారేసుకున్నారు ఇరాన్ పై. వారు తాము చెప్పిన ఫార్ములాకు ఒప్పుకోవాల‌ని లేకపోతే తిరిగి దాడులు చేసేందుకు వెనుకాడ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండదని ట్రంప్ పదేపదే చెప్పారు. ఇరాన్ తాజా ప్రతిపాదనతో తాను సంతృప్తి చెందలేదని అన్నారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు ట్రంప్. ఇరాన్‌తో ఒప్పందం భావన గురించి తనకు చెప్పారని, అయితే దానిలోని కచ్చితమైన పదజాలం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.

ట్రంప్ ఇప్పటి వరకు తిరస్కరించిన ఇరాన్ ప్రతిపాదన, హోర్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని తెరుస్తుందని చెప్పారు. ఇరాన్‌పై అమెరికా దిగ్బంధనాన్ని ముగిస్తుందని, అయితే ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను తర్వాతకు వదిలి వేస్తుందని ఒక సీనియర్ ఇరాన్ అధికారి తెలిపారు. ఇరాన్ చేసిన దానికి తగినంత పెద్ద మూల్యం చెల్లించలేదని ఆయన తన సోషల్ మీడియా ఛానెల్‌లో తెలిపారు. ఇరాన్‌పై దాడులను తిరిగి ప్రారంభిస్తారా అని అడిగినప్పుడు, ట్రంప్ ఇలా సమాధానమిచ్చారు. నేను అలా చెప్పాలను కోవడం లేదన్నారు ట్రంప్. అయితే అమెరికా తన వైఖరిని మార్చుకుంటే దౌత్యానికి టెహ్రాన్ సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports