బీజేపీ మోసం అనైతిక విజ‌యం : దీదీ

Spread the loveఎన్నిక‌ల సంఘంపై మాజీ సీఎం ఆగ్ర‌హం కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌లు ముగిశాయి. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఊహించ‌ని విధంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్బంగా మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌ధాని మోదీ, హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాల‌పై. బీజేపీ 100కి పైగా స్థానాలను…

Showing 81 of 2489 media items Load more Attachment Details Saved. newsseals-MamataBanarje
Spread the love

ఎన్నిక‌ల సంఘంపై మాజీ సీఎం ఆగ్ర‌హం

కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌లు ముగిశాయి. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఊహించ‌ని విధంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్బంగా మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌ధాని మోదీ, హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాల‌పై. బీజేపీ 100కి పైగా స్థానాలను దోచుకుందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్నికల సంఘం అనేది బీజేపీకి చెందిన సంఘం మాత్రమేనంటూ మండిప‌డ్డారు మ‌మ‌తా బెన‌ర్జీ. తాను ఎన్నికల అధికారికి (CO) , మనోజ్ అగర్వాల్‌కూ ఫిర్యాదు చేశానని చెప్పారు. కానీ వారు ఏమీ చేయలేక చేతులెత్తేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీన్ని మీరు విజయం అని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు మ‌మ‌తా బెన‌ర్జీ. ఇది అనైతిక విజయం తప్ప, నైతిక విజయం కానే కాద‌న్నారు. కేంద్ర బలగాలతోనూ, ప్రధానమంత్రి, హోంమంత్రితో నూ కలిసి ఎన్నికల సంఘం చేసినదంతా పూర్తిగా చట్ట విరుద్ధం అని ఆరోపించారు. ఇది దోపిడీ, దోపిడీ, కేవలం దోపిడీ మాత్రమే త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. తాము భ‌విష్య‌త్తులో క‌చ్చితంగా పుంజుకుని తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports