సంజు శాంస‌న్ షాన్ దార్ ఇన్నింగ్స్

Spread the love87 ర‌న్స్ 52 బంతులు 7 ఫోర్లు 6 సిక్స‌ర్లు ఢిల్లీ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ మ‌రోసారి స‌త్తా చాటాడు. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. అత్యంత క్లిష్టంగా మారిన పిచ్ పై త‌ను ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు పడ్డాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు…

newssealsSanjuSamson
Spread the love

87 ర‌న్స్ 52 బంతులు 7 ఫోర్లు 6 సిక్స‌ర్లు

ఢిల్లీ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ మ‌రోసారి స‌త్తా చాటాడు. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. అత్యంత క్లిష్టంగా మారిన పిచ్ పై త‌ను ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు పడ్డాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 155 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ఆదిలోనే షాక్ త‌గిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ‌రోసారి నిరాశ ప‌రిచాడు. త‌న‌తో పాటు క్రీజులోకి వ‌చ్చిన ప‌టేల్ దాడి చేసినా స్టంప్ అవుట్ అయ్యాడు. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన కార్తీక్ శ‌ర్మ జోర్దార్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు.

ఇక శాంస‌న్ , కార్తీక్ శ‌ర్మ‌లు మూడో వికెట్ కు రికార్డు భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. సంజు శాంస‌న్ 52 బాల్స్ ఎదుర్కొని 87 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు, 6 సిక్స‌ర్లు ఉన్నాయి. త‌న‌కు తోడుగా కార్తీక్ శ‌ర్మ సూప‌ర్ షో చేశాడు. త‌ను 31 బంతులు ఆడి 41 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టులో స‌మీర్ రిజ్వీ 24 బంతుల్లో 4 సిక్స‌ర్ల‌తో 40 నాటౌట్ గా నిలిచాడు స్ట‌బ్స్ 31 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 2 సిక్స‌ర్లు ఉన్నాయి. 38 ర‌న్స్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports