హెడ్ కోచ్ గా తిరిగి రానున్న రాహుల్ ద్రవిడ్
గౌతమ్ గంభీర్ కు కోలుకోలేని బిగ్ షాక్
ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , మాజీ హెడ్ కోచ్ గా ఇప్పటికే బాధ్యతలు నిర్వహించిన కర్ణాటకకు చెందిన రాహుల్ ద్రవిడ్ తిరిగి ఇండియా జట్టుకు ప్రధాన కోచ్ గా రానున్నాడా. అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఇదిలా ఉండగా హెడ్ కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్‌ను తొలగించి, ఆ స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను తిరిగి తీసుకు రావడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. ప్రస్తుతం నివేదికల ప్రకారం బీసీసీఐ ఉన్నతాధికారులు, భాగస్వాములందరి మధ్య అంతర్గత ఓటింగ్ నిర్వహించగా, అత్యధిక ఓట్లు రాహుల్ ద్రవిడ్‌కు అనుకూలంగా వచ్చినట్లు సమాచారం.
డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఒక చిన్న ఓటింగ్ నిర్వహించగా, దాదాపు ఆటగాళ్లందరూ గౌతమ్ గంభీర్‌ను తొలగించడానికే ఓటు వేసినట్లు టాక్. గౌతమ్ గంభీర్‌కు వ్యతిరేకంగా అన్ని అంశాలు ఉన్నందున, అతడిని హెడ్ కోచ్‌గా కొనసాగించడం జట్టు వాతావరణాన్ని దెబ్బ తీయవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, టీమ్ ఇండియాలోకి తిరిగి రావాలని బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌ను సంప్రదించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.