newsseals.com

బ్యాంక్ అకౌంట్ల వినియోగానికి ఐబొమ్మ రవికి ఊర‌ట‌

September 25, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : పైర‌సీ కేసులో అరెస్ట్ అయి ప్ర‌స్తుతం జైల్లో ఉన్న ఐ బొమ్మ ర‌వికి భారీ ఊర‌ట ల‌భించింది. త‌న ప‌రిస్థితి బాగో లేద‌ని, కేసు విచార‌ణ‌లో భాగంగా ఉన్న బ్యాంకు అకౌంట్ల‌న్నీ సీజ్ చేశారని వాపోయాడు. ఈ మేర‌కు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. త‌న బ్యాంక్ అకౌంట్లను వినియోగించుకునేలా అనుమ‌తి ఇవ్వాల‌ని దావాలో పేర్కొన్నాడు. దీనిపై విచార‌ణ చేప‌ట్టింది నాంప‌ల్లి కోర్టు. వాదోప‌వాద‌న‌లు విన్న అనంత‌రం కోర్టు కీల‌క తీర్పు చెప్పింది. ఐ బొమ్మ ర‌వి త‌న బ్యాంకు అకౌంట్ల‌కు సంబంధించి లావాదేవీలు నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టింంచింది. దీంతో మ‌నోడికి బిగ్ రిలీఫ్ ద‌క్కింది.

ఇదిలా ఉండ‌గా పైరసీ కేసులో రవిని అరెస్ట్ చేసిన పోలీసులు బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయించారు. తన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఉంచడం వల్ల కుటుంబ పోషణకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఫ్రీజ్ ఎత్తివే యించాలని అభ్యర్థించాడు. ఈ నేపథ్యంలో ఫ్రీజ్ ఎత్తివేయాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. సినిమా పైరసీ వెబ్‌సైట్ల నిర్వహణకు సంబంధించిన కేసుల్లో 2025 నవంబర్‌లో పోలీసులు త‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. iBomma, Bappam TV తదితర వెబ్‌సైట్ల ద్వారా సినిమాలను అనధికారికంగా అందుబాటులో ఉంచినట్లు ఆరోపించారు.

Related News