హైదరాబాద్ : హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పని చేసిన వీసీ సజ్జనార్ ను బదిలీ చేయడం పట్ల స్పందించారు సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావు. శుక్రవారం ఆయన సంచలన ఆరోపణలు చేశారు సజ్జనార్ పై. తను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని పేర్కొన్నారు. అంతే కాదు పోలీస్ యూనిఫాంలో ఉన్న హంతకుడు (నేరస్థుడు, క్రిమినల్ ) అని ఆరోపించారు. తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ తాజా కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరో వైపు తన వ్యాఖ్యల గురించి ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు వీసీ సజ్జనార్. ఇదిలా ఉండగా తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది. ఇందులో ఎవరూ ఊహించని విధంగా సీపీ సజ్జనార్ ను తప్పించింది.
ఈ సందర్బంగా సజ్జనార్‌ను బదిలీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సి.వి. ఆనంద్‌లకు మాజీ సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఒక మాజీ పోలీసు అధికారిని నిందించడం బాధాకరమే, కానీ ఇదే నిజం. బదిలీ అనేది శిక్ష కాదు. పైగా అది నేర స్వభావాన్ని మార్చదన్నారు నాగేశ్వర్ రావు. సజ్జనార్‌ను శిక్షించాలని అతని నేర కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. మరో వైపు ప్రభుత్వం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ మహేష్ భగవత్‌ను హైదరాబాద్ సీపీగా నియమించింది.




