హైదరాబాద్ : ఎవరీ రవి వేదుల అనుకుంటున్నారా..ఆయన పేరు పొందిన టెక్కీ. అంతే కాదు ప్రపంచ టెక్నాలజీ రంగంలో టాప్ లో కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్ దిగ్గజ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా కీలకమైన పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఎందరో హైదరాబాద్ నగరాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ రవి వేదుల మాత్రం ఓ వైపు వృత్తి రీత్యా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఈ భాగ్యనగరం పట్ల ఆయనకు ఉన్న ఆసక్తిని, ప్రేమను , అనురాగాన్ని, జ్ఞాపకాలను మరోసారి అక్షరాల లోకి ఒలికించే ప్రయత్నం చేశారు. ఆపై ఓ పుస్తకంగా మన ముందుకు తీసుకు వచ్చారు. ఈ సందర్బంగా కేటీఆర్ ఈ పుస్తకం గురించి ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరు చదివి తీరాలని ఆకాంక్షించారు. రవి వేదుల రాసిన ఆ పుస్తకం పేరు ‘హైదరాబాద్ డేస్: ది కోడ్ వి లివ్డ్ బై బిఫోర్ వి కోడెడ్’
ఈ పుస్తకం 1980, 1990 దశకాల నాటి హైదరాబాద్‌లోకి ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం మనకు గుర్తు చేస్తుంది. మన కాలనీల సంస్కృతి, గల్లీ క్రికెట్, చిన్ననాటి స్నేహాలు, ఒక తరాన్ని తీర్చిదిద్దిన జ్ఞాపకాలను నెమరు వేసుకునే ప్రయత్నం చేశానని ఈ సందర్భంగా పేర్కొన్నారు కేటీఆర్. రవి వేదుల తన పుస్తకం ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని హెచ్2హెచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు అంకితం చేయడం హృదయానికి ఎంతో ఆనందాన్నిచ్చిందని ప్రశంశలు కురిపించారు. హైదరాబాదీలుగా మనమందరం కలిసి రవికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మన ఉమ్మడి జ్ఞాపకాలను పంచుకుందాం, ఈ గొప్ప కార్యానికి మన వంతు సహకారం అందిద్దాం అని పేర్కొన్నారు. ఈ పుస్తకం https://a.co/d/04aqS9eC ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. పుస్తక ప్రేమికులు, నగరవాసులు, తెలంగాణ ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.




