స్వ‌ర్ణ ర‌థంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం

అంగ‌రంగ వైభంగా బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి : తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభోపేతంగా కొన‌సాగుతున్నాయి. టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్స‌వాల‌లో భాగంగా శ్రీ ప‌ద్మ‌వాతి అమ్మ వారిని ద‌ర్శించుకునేందుకు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు భ‌క్త జ‌న బాంధ‌వులు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్స‌వం జ‌రిగింది.

కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారు విశేష స్వ‌ర్ణ‌, వ‌జ్రాభ‌ర‌ణాల‌ను ధ‌రించి భ‌క్తుల‌కు కనువిందు చేశారు. పెద్ద‌సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొని స్వ‌ర్ణ‌ర‌థాన్ని లాగారు. ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో వి.వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఎస్ ఇ- 3 జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అమ్మ వారి ద‌ర్శ‌నం కోసం సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చారు. ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాల నుంచి రావ‌డం విశేషం.

  • Related Posts

    డోకిపర్రు మహాక్షేత్రం భ‌క్త జ‌న‌సందోహం

    డోకిపర్రు (గుడ్లవల్లేరు) : డోకిపర్రు మహాక్షేత్రంలోని భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం కోసం వందలాది మంది భక్తులు వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం…

    నవంబర్ 16న గోష్పాద క్షేత్రంలో గోదావరి హారతి

    తిరుపతి : గోదావరి నదికి ఆధ్యాత్మిక సంప్రదాయ బద్ధంగా హారతి సమర్పించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) ప్రభల గోపినాథ్ శనివారం టిటిడి శ్వేత సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. టిటిడి, దాస సాహిత్య ప్రాజెక్ట్, పశ్చిమ గోదావరి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *