ఫిఫాకు 150 మిలియ‌న్ల టికెట్లు కావాలి

అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయ‌న్న నిర్వాహ‌కులు

అమెరికా : ఇప్ప‌టి నుంచే ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిఫా టోర్న‌మెంట్ కు పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. మిలియ‌న్ల కొద్ది ఫ్యాన్స్ మ్యాచ్ లు చూసేందుకు ఎగ‌బ‌డుతున్నారు. ఈ సంద‌ర్బంగా గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఫిఫాకు 150 మిలియన్ల కు పైగా ప్రపంచ కప్ టిక్కెట్లు కావాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అమెరికా నుండి అభిమానులు అత్యధిక సంఖ్యలో టిక్కెట్ల కోసం అభ్యర్థనలు పంపారని చెప్పారు. ఆ తర్వాత జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్ ఉన్నాయని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ వచ్చే ఏడాది అమెరికా, కెనడా, మెక్సికోలో జరగబోయే ప్రపంచ కప్ టిక్కెట్ల ధరలను సమర్థించారు. వాటికి ఉన్న భారీ డిమాండ్, ప్రపంచ వ్యాప్తంగా క్రీడకు లభించే ఆదాయాన్ని ఆయన ఉదహరించారు.

ఈ నెలలో అభిమానుల బృందాలు టిక్కెట్ల ధరలపై భ‌గ్గుమ‌న్నాయి. గ‌తంలో 2022 లో నిర్వహించిన ఫిఫా టోర్నమెంట్‌లోని ఇలాంటి మ్యాచ్‌ల టిక్కెట్ల కంటే చాలా రెట్లు ఎక్కువ ధ‌ర ఉన్నాయంటూ వాపోయారు. అర్హత సాధించిన జట్ల అభిమానులకు మ్యాచ్‌లను మరింత సరసమైనవిగా చేయడానికి ఫిఫా $60 టిక్కెట్ శ్రేణిని ప్రవేశపెట్టిందన్నారు. త‌మ వ‌ద్ద ఆరు-ఏడు మిలియన్ల టిక్కెట్లు అమ్మకానికి ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా 15 రోజుల్లో మాకు 150 మిలియన్ల టిక్కెట్ల అభ్యర్థనలు వచ్చాయన్నారు. కాగా ప్ర‌తి రోజూ 10 మిలియ‌న్ల టికెట్లు కావాలంటూ కోరుతున్నార‌ని తెలిపారు . ఇన్సాంటినో దుబాయ్ లో జ‌రిగిన ప్ర‌పంచ క్రీడా సద‌స్సులో పాల్గొన్నారు. ప్రపంచ కప్ దాదాపు 100 సంవత్సరాల చరిత్రలో, ఫిఫా మొత్తం 44 మిలియన్ల టిక్కెట్లను విక్రయించింద‌ని ప్ర‌క‌టించారు. ఇది ఓ రికార్డు అని వెల్ల‌డించారు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *