పోలీసుల సేవ‌లు ప్ర‌శంస‌నీయం : సీఎం

పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమం

హైద‌రాబాద్ : స‌మాజం కోసం నిరంత‌రం సేవ‌లు అందిస్తున్న వారిలో పోలీసుల పాత్ర కీల‌క‌మైన‌ద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్ లోని పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరై ప్ర‌సంగించారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మొదట సహాయం కోసం ఎదురు చూసేది పోలీసుల కోసమేన‌ని చెప్పారు. ఒకప్పుడు తీవ్రవాదం ఒక సమస్యగా ఉండేదన్నారు. దానిని ఎదుర్కోవడానికి ఆక్టోపస్, గ్రేహౌండ్స్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చాం అన్నారు. అవినీతిని నిరోధించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం అని తెలిపారు.

ఫిజికల్ క్రైమ్ నిరోధించేందుకు ఇప్పటి వరకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నామ‌ని పేర్కొన్నారు సీఎం. కానీ ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయిందని అన్నారు . సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన సిస్టం ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్ మెంట్, ఇతర అంశాలకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారానికి పోలీసు ఉన్నతాధికారులు కొన్ని ప్రతిపాదనలు అందించారు. వీటిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తాం అని ప్ర‌క‌టించారు. ఆ కమిటీలో విశ్లేషించి సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు.

  • Related Posts

    ప్రాసిక్యూషన్‌కు ఫోరెన్సిక్ సైన్స్ వెన్నెముక : డీజీపి

    హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ ఆనంద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఫోరెన్సిక్ నివేదికలు చార్జిషీట్‌లకు వెన్నెముకగా ఉంటాయని పేర్కొన్నారు. విచారణ సమయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని అన్నారు. సాక్ష్యాలను సరిగ్గా సేకరించి, విశ్లేషించి, కోర్టులో సమర్పించక పోతే, క్షుణ్ణంగా పోలీసులు పని…

    హైడ్రాపై హైకోర్టు సీఎం రేవంత్ రెడ్డికి చెంప‌పెట్టు

    హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్పందించారు. ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డికి చెంప పెట్టు లాంటిద‌న్నారు. హిట్లర్ వారసుడినని చెప్పుకునే రేవంత్ రెడ్డికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *