newsseals.com
DEVOTIONAL

శ్రీ తిరుమలనాధ స్వామికి ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

VijayaBhaskar March 14, 2026
newsseals-TTDChairmman
Spread the love

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్సీ మ‌ల్ల‌న్న‌

యాదాద్రి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటిమామిడి గ్రామంలో వెలసిన శ్రీ తిరుమలనాధ స్వామి బ్రహ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభం అయ్యాయి. ఉత్స‌వాల‌లో భాగంగా టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ తిరుమలనాధ స్వామి ఆలయానికి టిటిడి చైర్మెన్ చేరుకోగానే ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనాంతరం ఆలయ అధికారులు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం తిరు కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు మాట్లాడారు. తిరుమల పేరుతో తిరుమలనాధ స్వామి ఆలయం ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉన్న శ్రీ తిరుమలనాధ స్వామి వారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధికి టిటిడి సహకారం అందిస్తుందని ప్ర‌క‌టించారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.