ఇషాన్ కిష‌న్ ప్ర‌వ‌ర్త‌న‌పై సీఎస్కే ఫ్యాన్స్ ఫైర్

Spread the love

ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీకి మేనేజ్మెంట్ పై ఫిర్యాదు

చెన్నై : ఐపీఎల్ 19 సీజ‌న్ లో ఆశించిన రీతిలో ఆడ‌లేక పోయింది భారీ ఫ్యాన్స్ ను క‌లిగి ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్. ఈసారి త‌ళా ఎంఎస్ ధోనీ మైదానంలో అడుగు పెట్టలేక పోయాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే సీఎస్కే స్కిప్ప‌ర్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవ‌డం కొంప ముంచేలా చేసింది. ఎస్ఆర్ హెచ్ బౌల‌ర్లు ప్ర‌ధానంగా కెప్టెన్ పాట్ క‌మిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సీఎస్కే టాప్ ఆర్డ‌ర్ ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 181 ర‌న్స్ చేసింది. అనంత‌రం స‌న్ రైజ‌ర్స్ 19 ఓవ‌ర్ల‌లోనే ప‌ని కానిచ్చేసింది. స్టార్ ప్లేయ‌ర్ ఇషాన్ కిష‌న్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. త‌ను కీల‌కంగా మార‌డంతో ఎస్ ఆర్ హెచ్ గ‌ట్టెక్కింది. సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.

ఇదిలా ఉండ‌గా విజ‌యం అనంత‌రం ఇషాన్ కిష‌న్ ప్ర‌వ‌ర్తించిన తీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌ను సీఎస్కే ఫ్యాన్స్ నిత్యం ఉప‌యోగించే విజిల్ పోడు ను త‌ను అనుక‌రించాడు. ఆపై స్టేడియంలో ఉన్న అభిమానుల‌ను ఉద్దేశించి ఇక వెళ్లి పోండి అంటూ సైగ‌లు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఎంఎస్ ధోనీ వీడ్కోలు సందర్భంగా ఇషాన్ కిషన్ ట్రోల్ చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఇంకోసారి ఇలా చేయొద్దంటూ సూచించారు.

  • Related Posts

    చెన్నై హైద‌రాబాద్ మ‌హా సంగ్రామానికి రెఢీ

    Spread the love

    Spread the loveఇరు జ‌ట్ల‌కు ఐపీఎల్ లీగ్ మ్యాచ్ కీల‌కం చెన్నై : ఐపీఎల్ 19 మెగా టోర్నీ అంత‌కంత‌కూ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే సోమ‌వారం చెన్నైలో జ‌రిగే కీల‌క లీగ్ మ్యాచ్ లో త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సి…

    రియాన్ పరాగ్ పై కుమార సంగక్కర ఆగ్రహం

    Spread the love

    Spread the loveఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓట‌మి న్యూఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో ప్లే ఆఫ్స్ రేసు లో నిలిచేందుకు జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ అద్బుత విజ‌యాన్ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *