భార‌త సైన్యం కోసం సూర్య భారీ విరాళం

Spread the love

దుబాయ్ వేదిక‌గా ప్ర‌క‌టించిన కెప్టెన్

దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీ ముగిసింది. ఎంతో ఉత్కంఠ భ‌రితంగా సాగింది ఫైన‌ల్ మ్యాచ్ పాకిస్తాన్ తో. ఈ కీల‌క పోరులో టీం ఇండియా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. దాయాది జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌ను ఆడ‌కుండానే చేతులెత్తేసింది. ఆ జ‌ట్టు 146 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన భార‌త జ‌ట్టు కేవ‌లం 5 వికెట్లు కోల్పోయి 150 ర‌న్స్ చేసింది. ఆసియా క‌ప్ విజేత‌గా నిలిచింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడుల్లో పెహ‌ల్గామ్ లో టూరిస్టులు 26 మందిని కాల్చి చంపారు. దీ

నికి నివాళిగా భార‌త జ‌ట్టు పాకిస్తాన్ తో క‌ర‌చాల‌నం చేయ‌లేదు. అంతే కాదు ఆసియా క‌ప్ ను తీసుకునేందుకు కూడా నిరాక‌రించింది టీమ్ ఇండియా. ఆసియా క‌ప్ ను గెలుపొందిన అనంత‌రం భార‌త జ‌ట్టు స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ఈ మేర‌కు తాను టోర్నీలో ఆడియ‌న ప్ర‌తి మ్యాచ్ సంద‌ర్బంగా ఫీజుల ద్వారా ఇచ్చే డ‌బ్బుల‌ను పూర్తిగా భార‌త దేశ ర‌క్ష‌ణ కోసం నిమ‌గ్న‌మైన ఆర్మీకి విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. త‌ను చేసిన ప్ర‌క‌ట‌న‌కు క్రీడాలోకంతో పాటు అభిమానులు సైతం సూర్యా భాయ్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. త‌ను తీసుకున్న నిర్ణ‌యం తోటి క్రీడాకారుల‌కు స్పూర్తి దాయ‌కంగా నిలుస్తుంద‌ని పేర్కొంటున్నారు.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్

    Spread the love

    Spread the loveత‌న‌కు ఛాన్స్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ ర‌వి చంద్ర‌న్ అశ్విన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం శ్రేయాస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని టీమ్ ఇండియా ఐర్లాండ్ లో ప‌ర్య‌టిస్తోంది. ఇందులో…

    ఐర్లాండ్ తో ఓట‌మి పై అయ్య‌ర్ కామెంట్స్

    Spread the love

    Spread the loveమేం మ‌ళ్లీ పుంజుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో అత్యంత బ‌ల‌మైన భార‌త జ‌ట్టు పేల‌వ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. భారీ తేడాతో ఓడి పోయింది. ఈ సంద‌ర్బంగా జ‌ట్టు కెప్టెన్ శ్రేయాస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *