తిరుమ‌ల‌లో ఘ‌నంగా శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం

Spread the love

నేటితో ముగియ‌నున్న బ్ర‌హ్మోత్సవాలు

తిరుమ‌ల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివ‌రి రోజైన‌ అక్టోబర్ 2వ తేదీ గురువారం శ్రీవారి పుష్కరిణిలో చ‌క్ర‌స్నానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. ఉద‌యం 6 నుండి 9 గంట‌ల మ‌ధ్య శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామివారి ఉత్స‌వ మూర్తుల‌కు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం చేప‌ట్టారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. టిటిడి అధికారులు, విజిలెన్స్‌, పోలీసుల స‌మ‌న్వ‌యంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూశారు. భ‌క్తులు పుష్క‌రిణిలోకి ప్ర‌వేశించేందుకు, తిరిగి వెలుప‌లికి వెళ్లేందుకు వీలుగా గేట్ల‌ను ఏర్పాటు చేయ‌డంతో ఎలాంటి ఇబ్బందులు ఏర్ప‌డ‌లేదు. పుష్కరిణిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోట్ల‌ను అందుబాటులో ఉంచింది టీటీడీ ముందు జాగ్ర‌త్త‌గా.

చక్రస్నానం సందర్భంగా 1,000 మంది పోలీసులు, 1300 మంది టిటిడి విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఫైర్, స్మిమ్మింగ్ తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్టమైన‌ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టారు. టిటిడి సూచించిన నిబంధనల మేరకు గ్యాలరీలలోని భక్తులను దశల వారీగా పుష్కరిణిలోకి అనుమ‌తించారు. పుష్కరిణిలోనికి నిర్దేశించిన గేట్ల ద్వారా మాత్ర‌మే ప్ర‌వేశించేలా చేశారు. భక్తులు శ్రీవారి చక్రస్నానం వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడవీధుల్లో 23, పుష్కరిణిలో 4, మొత్తం 27 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భ‌క్తుల సౌల‌భ్యం కొర‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించేందుకు పుష్క‌రిణి స‌మీపంలోని ర‌థం వ‌ద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.

  • Related Posts

    శ్రీవారి సేవ చేయడం పూర్వ జ‌న్మ సుకృతం

    Spread the love

    Spread the loveతిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం ఈవో ర‌విచంద్ర‌ తిరుపతి : తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టిటిడి ఈవో ఎం. రవిచంద్ర అన్నారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జాతీయ పౌర దినోత్సవాన్ని…

    ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు

    Spread the love

    Spread the loveభారీ ఎత్తున హాజ‌రైన టీడీపీ కార్య‌క‌ర్త‌లు శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌ఘ‌నంగా వేడుక‌లు చేప‌ట్టారు. ప‌లువురు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *