నీటి వ‌న‌రుల‌ను సంర‌క్షించుకోక పోతే ప్ర‌మాదం

Spread the loveపిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ అమ‌రావ‌తి : నీటి వనరులను సంరక్షించుకోక పోతే భవిష్యత్తు తరాలు నీటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చ‌రించారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. భూగర్భ జలాలను పెంపొందించు కోవడం, భూ సారాన్ని కాపాడు కోవడం, సాగునీటిని సద్వినియోగం చేసుకోవడం మనందరి బాధ్యత అని స్ప‌ష్టం చేశారు. నీటి వృథాను పూర్తిగా నిరోధిస్తూ, ప్రతి గ్రామంలో చెరువులు, కెనాళ్లను పునరుద్ధరించే కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని…

hellotelugu-KandulaDurgesh
Spread the love

పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్

అమ‌రావ‌తి : నీటి వనరులను సంరక్షించుకోక పోతే భవిష్యత్తు తరాలు నీటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చ‌రించారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. భూగర్భ జలాలను పెంపొందించు కోవడం, భూ సారాన్ని కాపాడు కోవడం, సాగునీటిని సద్వినియోగం చేసుకోవడం మనందరి బాధ్యత అని స్ప‌ష్టం చేశారు. నీటి వృథాను పూర్తిగా నిరోధిస్తూ, ప్రతి గ్రామంలో చెరువులు, కెనాళ్లను పునరుద్ధరించే కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధికి దోహదపడే పలు సంఘాలకు చెక్కుల పంపిణీ చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాన‌ని చెప్పారు.

గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో జరిగిన వాటర్ షెడ్ మహోత్సవ్ జాతీయ సదస్సు కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర కమ్యూనికేషన్లు , గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి లక్ష్యాలకు కీలకంగా నిలిచే ఈ కార్యక్రమం, మన రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణ, గ్రామీణ అభివృద్ధి పనులకు మరింత బలం చేకూరుస్తుందని చెప్పారు. రానున్న కాలంలో 10 కోట్ల మందిని లక్‌పత్ లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ప్రకటించడం చాలా సంతోషకరం అన్నారు దుర్గేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports