నీటి పారుద‌ల వ్య‌వ‌స్థను బ‌లోపేతం చేయాలి

Spread the loveచ‌ర్య‌లు తీసుకోవాల‌న్న బండారు శ్రావ‌ణి శ్రీ‌ అనంత‌పురం జిల్లా : శిoగనమల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. నియోజకవర్గంలోని మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ (MPSC) , తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ (TBC) వ్యవస్థలకు సంబంధించిన నిర్వహణ, మరమ్మత్తు అంశాలపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్‌ఎల్‌సీ (HLC) , మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కాలువల ప్రస్తుత…

newsseals-BaandaruSravaniSree
Spread the love

చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న బండారు శ్రావ‌ణి శ్రీ‌

అనంత‌పురం జిల్లా : శిoగనమల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. నియోజకవర్గంలోని మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ (MPSC) , తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ (TBC) వ్యవస్థలకు సంబంధించిన నిర్వహణ, మరమ్మత్తు అంశాలపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్‌ఎల్‌సీ (HLC) , మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కాలువల ప్రస్తుత పరిస్థితి, లైనింగ్ లేమి, నీటి లీకేజీలు, చెరువుల నింపుదల, , రైతులకు నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై సమగ్రంగా చర్చించారు. నియోజకవర్గంలో వ్యవసాయం పూర్తిగా ఈ నీటిపారుదల వ్యవస్థలపై ఆధారపడి ఉండటంతో, నిర్వహణ పనులు అత్యవసరమని అధికారులు వివరించారు.

శిoగనమల నియోజకవర్గానికి చెందిన రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, నీటిపారుదల వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. నియోజకవర్గంలో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని, వాటి పరిష్కారం ద్వారా నీటి వినియోగాన్ని మెరుగు పరచడం, చెరువుల నింపుదల, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంద‌న్నారు. నీటి వినియోగదారుల సంఘాల సమన్వయంతో ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports