శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం ప్ర‌త్యేక పాల‌సీ

Spread the loveతీసుకు వ‌స్తున్నామ‌న్న మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : ప్ర‌భుత్వ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం రాష్ట్ర కూట‌మి ప్ర‌భుత్వం ప్రత్యేక‌మైన పాల‌సీని తీసుకు వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత . అమ‌రావ‌తిలోని సచివాలయం బ్లాక్-2లో నిర్వహించిన లిటిగేషన్ పాలసీపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూఖ్ , వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్…

newsseals-AnithaVangalapudi
Spread the love

తీసుకు వ‌స్తున్నామ‌న్న మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : ప్ర‌భుత్వ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం రాష్ట్ర కూట‌మి ప్ర‌భుత్వం ప్రత్యేక‌మైన పాల‌సీని తీసుకు వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత . అమ‌రావ‌తిలోని సచివాలయం బ్లాక్-2లో నిర్వహించిన లిటిగేషన్ పాలసీపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూఖ్ , వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ తో క‌లిసి హోం మంత్రి పాల్గొన్నారు.

ప్ర‌ధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కోర్టులలో పెండింగ్‌లో ఉన్న వివిధ న్యాయ వ్యవహారాలు , కేసుల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించడం జ‌రిగింద‌ని చెప్పారు అనిత వంగ‌ల‌పూడి. ​ముఖ్యంగా కేసుల పరిష్కారంలో సమయ పాలన పాటించడం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, సమగ్రమైన పాలసీ రూపకల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో మరింత న్యాయ పరమైన పారదర్శకతను, పనితీరులో సమర్థతను పెంపు పొందించే దిశగా ఈ లిటిగేషన్ పాలసీని బలోపేతం చేయాలని నిర్ణయించిన‌ట్లు వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports