తమిళ‌నాట బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన టీవీకే విజ‌య్

Spread the loveటీవీకే పార్టీకి మ‌ద్ద‌తుగా 144 మంది ఎమ్మెల్యేలుచెన్నై : ఉత్కంఠ‌కు తెర దించుతూ టీవీకే పార్టీ విజ‌య్ శాస‌న స‌భ‌లో బుధ‌వారం జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు 118 మ్యాజిక్ ఫిగ‌ర్ కావాల్సి ఉండ‌గా ఏకంగా టీవీకే పార్టీకి 144 మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ప‌లికారు. ఈ మేర‌కు స్పీక‌ర్ ప్ర‌భాక‌ర్ ఎవ‌రు మ‌ద్ద‌తు ఇస్తున్నారో ఆ ఎమ్మెల్యేలంతా చేతులు ఎత్తాల‌ని ఆదేశించారు. దీంతో మొత్తం టీవీకే బ‌లానికి గాను 108…

newsseals-TVKPartyWin
Spread the love

టీవీకే పార్టీకి మ‌ద్ద‌తుగా 144 మంది ఎమ్మెల్యేలు
చెన్నై : ఉత్కంఠ‌కు తెర దించుతూ టీవీకే పార్టీ విజ‌య్ శాస‌న స‌భ‌లో బుధ‌వారం జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు 118 మ్యాజిక్ ఫిగ‌ర్ కావాల్సి ఉండ‌గా ఏకంగా టీవీకే పార్టీకి 144 మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ప‌లికారు. ఈ మేర‌కు స్పీక‌ర్ ప్ర‌భాక‌ర్ ఎవ‌రు మ‌ద్ద‌తు ఇస్తున్నారో ఆ ఎమ్మెల్యేలంతా చేతులు ఎత్తాల‌ని ఆదేశించారు. దీంతో మొత్తం టీవీకే బ‌లానికి గాను 108 మంది ఉండ‌గా ఒక‌రిని హైకోర్టు పాల్గొన వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. ఇంకో వైపు విజ‌య్ రెండు చోట్ల గెలుపొందారు. ఆ ఒక్క సీటు మిన‌హాయించి టీవీకే ఎమ్మెల్యేలు 106 మంది, కాంగ్రెస్, వీసీకే, జేయుఎంఎల్, సీపీఐ, సీపీఎం, ఏఐఏడీఎంకేకు చెందిన తిరుగుబాటు వ‌ర్గం ఎమ్మెల్యేలు సపోర్ట్ గా నిలిచారు.

ఈ సంద‌ర్బంగా విశ్వాస తీర్మానంలో తనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే కూటమి ‘మక్కల్’ (తమిళంలో ప్రజలు) కూటమిగా ఉంటుందని ఆయన వారికి హామీ ఇచ్చారు. అంత‌కు ముందు మంగ‌ళ‌వారం తన మిత్రపక్షాలతోనూ, ప్రత్యర్థులైన AIADMK, DMKలతోనూ, అలాగే తనపై తీవ్ర విమర్శలు చేసే NTK వ్యవస్థాపకుడు సీమాన్‌తోనూ వరుస సమావేశాలు నిర్వహించిన ఒక రోజు తర్వాత ఈ బలపరీక్ష జరిగింది. AIADMK అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామికి ఇది ఒక చేదు పుట్టినరోజు కానుకగా మారింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడంతో, ఆ పార్టీ చీలిపోయే దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports