కేసీఆర్ నివాసానికి నీటి స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌ర‌ణ

Spread the loveవివ‌ర‌ణ ఇచ్చిన హైద‌రాబాద్ జ‌ల‌మండ‌లి హైద‌రాబాద్ : ఎండాకాలం కావ‌డంతో తీవ్ర నీటి ఎద్ద‌డి కొన‌సాగుతోంది హైద‌రాబాద్ న‌గ‌గ‌రంలో. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు లేక పోవ‌డంతో జ‌నం అల్లాడి పోతున్నారు. ఈ త‌రుణంలో ప్ర‌త్యాయ్నాయ ఏర్పాట్ల‌లో మునిగి పోయింది న‌గ‌ర జ‌ల‌మండ‌లి శాఖ‌. ఇదిలా ఉండ‌గా ఈ మ‌ధ్య‌న మాజీ సీఎం , తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాసంలో నీటి ఎద్ద‌డి ఏర్ప‌డడం, నీళ్లు రాక పోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో జ‌లమండ‌లి శాఖ…

newsseals-Jaalamandali
Spread the love

వివ‌ర‌ణ ఇచ్చిన హైద‌రాబాద్ జ‌ల‌మండ‌లి

హైద‌రాబాద్ : ఎండాకాలం కావ‌డంతో తీవ్ర నీటి ఎద్ద‌డి కొన‌సాగుతోంది హైద‌రాబాద్ న‌గ‌గ‌రంలో. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు లేక పోవ‌డంతో జ‌నం అల్లాడి పోతున్నారు. ఈ త‌రుణంలో ప్ర‌త్యాయ్నాయ ఏర్పాట్ల‌లో మునిగి పోయింది న‌గ‌ర జ‌ల‌మండ‌లి శాఖ‌. ఇదిలా ఉండ‌గా ఈ మ‌ధ్య‌న మాజీ సీఎం , తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాసంలో నీటి ఎద్ద‌డి ఏర్ప‌డడం, నీళ్లు రాక పోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో జ‌లమండ‌లి శాఖ వెంట‌నే స్పందించింది. ఈ మేర‌కు వాట‌ర్ ట్యాంక‌ర్ ను పంపించింది. ఈ మేర‌కు కేసీఆర్ నివాసానికి నీటి స‌రఫ‌రాను పున‌రుద్ద‌రించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది జ‌ల‌మండ‌లి. కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

అయితే సాధారణ షెడ్యూల్ ప్రకారం నీటి సరఫరా కొనసాగుతోందని స్ప‌ష్టం చేసింది జలమండలి
సమావేశాలు లేదా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కేసీఆర్ పర్సనల్ పీఏ అభ్యర్థన మేరకు అదనపు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తున్న‌ట్లు తెలిపింది. గత ఐదేళ్లుగా అవసరాన్ని బట్టి అభ్యర్థన మేరకు నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ప్రస్తుతం మీటర్ మరమ్మత్తులో ఉంద‌ని, ఆ కాలనీలో ఒక రోజు విడిచి ఒక రోజు నీటి సరఫరా జరుగుతోందని వెల్ల‌డించింది జ‌ల‌మండ‌లి. ఏప్రిల్ 24న స్టడీ సర్కిల్ వద్ద పైప్‌లైన్ చోక్ కారణంగా తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని, అదే రోజు సమస్యను పరిష్కరించి నీటి సరఫరా పునరుద్ధరించామ‌ని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports