డీ లిమిటేష‌న్ పై జ‌న‌సేన క‌మిటీ ఏర్పాటు

Spread the loveప్ర‌క‌టించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం , జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. డీ లిమిటేషన్ జరిగే అవకాశాలు ఉన్నందున ఈ రెండు ముఖ్యాంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేపట్టి పార్టీకి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. ఈ కమిటీలో సీనియర్ నాయకులు, అన‌కాప‌ల్లి శాసనసభ్యులు…

newsseals-PawanKalyn
Spread the love

ప్ర‌క‌టించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం , జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. డీ లిమిటేషన్ జరిగే అవకాశాలు ఉన్నందున ఈ రెండు ముఖ్యాంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేపట్టి పార్టీకి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. ఈ కమిటీలో సీనియర్ నాయకులు, అన‌కాప‌ల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ , పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్, ఆరణి శ్రీనివాసులు గారు ( తిరుపతి), శ్రీ పంతం నానాజీ (కాకినాడ రూరల్), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం) ల‌ను నియ‌మించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

వీరితో పాటు సీహెచ్ వంశీకృష్ణ గారు (విశాఖ సౌత్), మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను , ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవింద రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్ల‌డించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లోనే పార్టీ చీఫ్ నియ‌మితులైన క‌మిటీ స‌భ్యుల‌కు దిశా నిర్దేశం చేస్తార‌ని తెలిపారు జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు కొణిద‌ల‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports