ఎవ‌రీ అనిల్ కుమార్ సింఘాల్ ఏమిటా ప్ర‌త్యేక‌త‌

Spread the love

టీటీడీకి ఈవోగా రెండోసారి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ఏరికోరి ఎందుకు సీనియ‌ర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియ‌మించింద‌నే దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో ఏపీ సీఎంగా కొలువు తీరిన స‌మ‌యంలో త‌న‌ను ఈవోగా అపాయింట్ చేశారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చాక త‌న‌ను మార్చేశారు. అయినా ఎక్క‌డ‌, ఏ ప‌ద‌వి ఇచ్చినా అనిల్ కుమార్ సింఘాల్ ఆ ప‌ద‌వుల‌కు న్యాయం చేసేలా కృషి చేశారు. ప్ర‌ధానంగా ఎలాంటి అవినీతి మ‌ర‌క‌లు అంట‌ని వ్య‌క్తి. త‌ను తొలిసారిగా ఈవోగా కొలువు తీరిన స‌మ‌యంలో గాడి త‌ప్పిన టీటీడీని గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేశారు. అంతే కాదు జ‌వాబుదారీత‌నం ఉండేలా చూశారు. త‌ను ఏపీకి చెందిన 1993 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీస‌ర్.

అంత‌కు ముందు ఉమ్మ‌డి ఏపీలో గ‌ద్వాలలో అనిల్ కుమార్ సింఘాల్ 1995లో స‌బ్ క‌లెక్ట‌ర్ గా ప‌ని చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆరోగ్య శాఖ, ఫైనాన్స్ శాఖ, విజయవాడ, విశాఖపట్నం కలెక్టర్ వంటి కీలక పదవుల్లో కూడా పనిచేశారు. కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ముఖ్య పాత్ర పోషించారు. విచిత్రం ఏమిటంటే తొమ్మిది ద‌శాబ్దాల చ‌రిత్ర‌లో ఎవ‌రికీ ద‌క్క‌ని అవ‌కాశం అనిల్ కుమార్ సింఘాల్ కు ద‌క్క‌బోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈవోగా ప‌ని చేసిన వారికి రెండుసార్లు ఛాన్స్ ఇవ్వ‌లేదు. కానీ సీఎం త‌న ప‌నితీరును ఆధారంగా మ‌రోసారి ప‌ని చేసేందుకు అవ‌కాశం ద‌క్కేలా చేశారు. ఈనెల 10వ తేదీన టీటీడీ ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ బోతున్నారు. ఆయ‌న గ‌తంలో ఈవోగా మే 1, 2017 నుండి అక్టోబ‌ర్ 4, 2020 దాకా విధులు నిర్వ‌హించారు.

  • Related Posts

    బీసీసీఐ యాజ‌మాన్యంపై గ‌వాస్క‌ర్ సీరియ‌స్

    Spread the love

    Spread the love60 ఏళ్లుగా చూస్తున్నా ఇలా ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ)…

    తెప్పపై విహరించిన శ్రీ సుందరరాజ స్వామి

    Spread the love

    Spread the loveఘ‌ణంగా కొన‌సాగుతున్న ప‌ద్మావ‌తి ఉత్స‌వాలు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వార్షిక తెప్పోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా పద్మ సరోవరంలో శ్రీ సుందర రాజ స్వామివారు తెప్పపై మూడు చుట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *