విజ‌య‌వాడ ఘ‌ట‌న‌లో 45 మంది రౌడీ షీట‌ర్లు

విజ‌య‌వాడ : విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి సీపీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఘర్షణలకు సంబంధించిన వీడియోల ఆధారంగా పోలీసులు గుర్తించిన 260 మందిలో ఏకంగా 45 మంది రౌడీ షీటర్లు, 71 మంది అల్లరి మూకలకు చెందినవారు కాగా, 91 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామన్న ముసుగులో, కరుడుగట్టిన నేరస్తుల ముఠాను ఊరేగిస్తూ నిరసనలు చేపట్టడం అనేది YSRCP అనుసరిస్తున్న ‘నేరపూరిత రాజకీయాలకు’ (crime politics) ఒక సరైన నిదర్శనంగా నిలుస్తోంది.

ప్రజాస్వామ్య యుతంగా వినతి పత్రాలు సమర్పించడానికి బదులుగా… ముగ్గురు మాజీ మంత్రులు, 8 మంది ఎమ్మెల్సీలు మరియు 5 మంది మాజీ ఎమ్మెల్యేల సమక్షంలోనే రౌడీలను ఉసిగొల్పి, అధికారులను , ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించడమే వారి అసలు వ్యూహంగా ఉందంటూ అధికార కూట‌మి ఆరోపించింది. వంద మంది పాల్గొన్న ఒక రాజకీయ ర్యాలీలో, వారిలో యాభై మంది క్రిమినల్ కేసులు ఉన్న దుండగులే అయితే… అది ప్రజా పోరాటం ఎలా అనిపించుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు. అది పూర్తిగా ఒక ‘నేర సామ్రాజ్య ప్రదర్శన’ మాత్రమే అవుతుందని పేర్కొన్నారు.

  • Related Posts

    ఎన్నికల అక్రమాలకు సీఈసీ అనుమతిస్తే ఎలా..?

    న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు సీఈసీ ప‌ర్మిష‌న్ ఇస్తే అది దేశ ద్రోహం కింద‌కే వ‌స్తుంద‌న్నారు. దీనికి బాధ్యులైన వారిని కచ్చితంగా నిలదీయాలని అన్నారు.…

    సోషల్ మీడియా పోస్ట్‌లకు నేను బాధ్యుడిని కాను

    చెన్నై :డీఎంకే పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. DMK విభాగాలు, కార్యకర్తలు చేసే సోషల్ మీడియా పోస్ట్‌లకు తనను బాధ్యుడిని ఎలా చేస్తారంటూ పేర్కొన్నారు. ఈ విచిత్ర‌మైన వాద‌న‌ను హైకోర్టులో విచార‌ణ సంద‌ర్బంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *