క‌ర్ణాట‌క సీఎంతో తెలంగాణ మంత్రుల బృందం భేటీ

బెంగ‌ళూరు : అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటకలో తెలంగాణ బృందం బుధ‌వారం ప‌ర్య‌టించింది. ఈ మేర‌కు బెంగ‌ళూరులో ప్ర‌త్యేకంగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ తో రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావులు మరోసారి స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆల్మట్టి నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. ఇదే స‌మ‌యంలో ఇప్పటికే వినతి పత్రం సమర్పించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు మంత్రులు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీటి ఎద్దడి, పంటల ప్రస్తుత పరిస్థితులు వంటి అంశాలను డీకే శివకుమార్‌కు వివరించారు. ప్ర‌స్తుతం వ‌ర్షాభావ ప‌రిస్తితులు నెల‌కొన్నాయ‌ని, ఇక ప్ర‌జ‌లకు సాగు నీటికంటే తాగు నీటి కోసం ఇబ్బందులు ప‌డే ప్ర‌మాదం ఉందంటూ వాపోయారు.

ఈ కీల‌క‌, క్లిష్ట స‌మ‌యంలో మానవతా దృక్పథంతో పాలమూరు ప్రజలకు సాగు, తాగునీటిని విడుదల చేయాలని సీఎం డీకే శివ‌కుమార్ కు విన్న‌వించారు మంత్రులు, ఎమ్మెల్యేలు. మంత్రులు చేసిన విజ్ఞప్తికి అంగీకారం తెలిపారు సీఎం డీకే శివకుమార్‌. ఇదిలా ఉండ‌గా నీటి విడుదలపై సానుకూలంగా స్పందించిన‌ట్లు వెల్ల‌డించారు సీఎంతో సమావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడారు వాకిటి శ్రీ‌హ‌రి ముదిరాజ్, జూప‌ల్లి కృష్ణారావు. నీటి విడుదలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు డీకే శివ‌కుమార్. ఈ సంద‌ర్బంగా సీఎంకు వారు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

  • Related Posts

    ఎన్నికల అక్రమాలకు సీఈసీ అనుమతిస్తే ఎలా..?

    న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు సీఈసీ ప‌ర్మిష‌న్ ఇస్తే అది దేశ ద్రోహం కింద‌కే వ‌స్తుంద‌న్నారు. దీనికి బాధ్యులైన వారిని కచ్చితంగా నిలదీయాలని అన్నారు.…

    సోషల్ మీడియా పోస్ట్‌లకు నేను బాధ్యుడిని కాను

    చెన్నై :డీఎంకే పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. DMK విభాగాలు, కార్యకర్తలు చేసే సోషల్ మీడియా పోస్ట్‌లకు తనను బాధ్యుడిని ఎలా చేస్తారంటూ పేర్కొన్నారు. ఈ విచిత్ర‌మైన వాద‌న‌ను హైకోర్టులో విచార‌ణ సంద‌ర్బంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *