ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ మామూలోడు కాద‌ప్పా

అధికారం, మ‌తం, శృంగారం, ఆధ్యాత్మికం, నేరం , రాజ‌కీయం క‌ల‌గలిసి పోయిన చోట న్యాయం కోసం ఎదురు చూడ‌టం అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అని మొక్కిన‌ట్లు ఉంటుంది. మ‌నుషుల మ‌ధ్య విభేదాల‌ను సృష్టించి , మ‌తం అనే ముసుగు…

అడ‌వి బిడ్డ‌ల ఆరాధ్య దైవం చెర‌గ‌ని సంత‌కం

కోట్లాది అడ‌వి బిడ్డ‌ల ఆక్రంద‌న‌లు, క‌న్నీళ్ల‌ మ‌ధ్య సెలవు తీసుకున్నాడు శాశ్వ‌తంగా శిబు సోరేన్. నా శ్వాస మీకోసం, ఈ దేహం ఈ అంద‌మైన అడ‌విలోనే సేద దీరాల‌ని అనుకుంటోందంటూ వెళ్లి పోయాడు. సామాజిక సంస్క‌ర్త నుండి దిగ్గ‌జ గిరిజ‌న నాయ‌కుడిగా…

మూగ బోయిన ‘స‌త్యం’ దివికేగిన ‘ధిక్కార స్వ‌రం’

ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు. వాళ్ల‌కు ఏ ఇబ్బంది క‌లిగినా నేను ఒప్పుకోను. కేప‌టలిజం ఇవాళ ప్ర‌పంచాన్ని క‌బ‌లించ వ‌చ్చు కానీ రేప‌టి రోజున సోష‌లిజ‌మే యావ‌త్ మాన‌వాళికి, ప్ర‌పంచానికి మార్గం చూపుతుంది. అన్నం పండించే రైతుల కోసం నా శ్వాస ఉన్నంత…

క్యాంపా కోలా మార్కెట్ లో ఓలాలా

వ్యాపారం..రాజ‌కీయం క‌ల‌గ‌లిసి పోయిన చోట ఒప్పందాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మోదీ ఎప్పుడైతే ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరాడో ఆనాటి నుంచి నేటి దాకా ఈ దేశంలోని ప్ర‌ధాన వ‌న‌రుల‌న్నీ ముగ్గురు చేతుల్లోకి వెళ్లి పోయాయి. వారి గురించి ఎంత చెప్పినా త‌క్కువే.…

ల‌క్ష‌లాది డ్రైవ‌ర్లు..కార్మికుల‌కు స‌లావుద్దీన్ స్పూర్తి

ఎవ‌రీ షేక్ స‌లావుద్దీన్ అనుకుంటున్నారా. భార‌త దేశంలో పేరు పొందిన యూనియ‌న్ నాయ‌కుడు. అంతే కాదు కోట్లాది మంది ప్ర‌యాణీకుల‌ను త‌మ గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్న ట్యాక్సీ డ్రైవ‌ర్లు, కార్మికుల‌కు షేక్ స‌లావుద్దీన్ స్పూర్తిగా నిలుస్తున్నాడు. ఆ…

ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం కామెంట్స్ క‌ల‌క‌లం టీటీడీలో సంచ‌ల‌నం

ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తుల‌ను క‌లిగి ఉన్న దేవుళ్ల‌లో తిరుమ‌ల‌లో కొలువై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఒక‌రు. ప్ర‌తి నిత్యం 70 వేల నుంచి 80 వేల మంది దాకా భ‌క్తులు సుదూర ప్రాంతాల నుండి త‌ర‌లి వ‌స్తారు.…

హెచ్‌సిఏ నిర్వాకం క్రికెట్ కు మంగ‌ళం

అంద‌రి క‌ళ్లు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఏ ) పై ప‌డ్డాయి. గ‌త కొన్నేళ్లుగా దీని నిర్వ‌హ‌ణ‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. కోట్లాది రూపాయ‌ల ఆదాయం క‌లిగిన ఈ సంస్థపై ఆధిప‌త్యం చెలాయించేందుకు అన్ని వ‌ర్గాలు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. దేశంలో ఎక్క‌డా…

సీఎం ఢిల్లీ బాట మేడం జ‌నం బాట

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏం జ‌రుగుతోంద‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇక్క‌డికి రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ గా మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఎప్పుడైతే వ‌చ్చిందో అప్ప‌టి నుంచి నేటి దాకా సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్య‌త త‌గ్గిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. విచిత్రం…

సైబ‌ర్ కేటుగాళ్లు రూ. 23 వేల కోట్లు కొట్టేశారు

మేక్ ఇన్ ఇండియా, స్టార్ట‌ప్ ఇండియా, టెక్నాల‌జీ హ‌బ్ గా భార‌త్ విరాజిల్లుతోందంటూ నిత్యం ప్ర‌చారం చేసుకునే ఇండియాలో సైబ‌ర్ కేటుగాళ్లు (నేర‌స్థులు) ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 23,000 కోట్లకు క‌న్నం వేశారు. త‌మ తెలివి తేట‌ల‌కు…

సిగాచి ఘ‌ట‌న స‌రే పోయిన ప్రాణాల మాటేంటి..?

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్ర‌మాదానికి ఆహుత‌య్యారు. రంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని విస్తు పోయేలా చేసింది. ఇంత‌టి ఘోరం జ‌రిగినా…